తిరుపతి: క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా ఆడియో కార్యక్రమం తిరుపతిలో వైభవంగా జరిగింది. నగరంలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ ఆడియో వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, సిరివెన్నెల సీతారామశాస్త్రి సహా పలువురు సినీరంగ ప్రముఖలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
చారిత్రాత్మక చిత్రంతో పాటు బాలయ్య వందో చిత్రం కూడా కావటంతో కళ్లుచెదిరే సెట్టింగ్ లతో ఆడియో వేడుకను భారీగా నిర్వహించారు. సంక్రాంతి కానుకగా గౌతమీపుత్ర శాతకర్ణి ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. బాలయ్య సరసన శ్రియా హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలినీ బాలకృష్ణ తల్లి పాత్రలో కనిపించనున్నారు. కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ శాతకర్ణి కొడుకు పాత్రలో నటించారు.
No comments:
Post a Comment